Sale Date Ended
పరుగులు తీస్తూన్న ప్రపంచ టెక్నాలజీ ని మన అర చేతిలో చిన్న స్మార్ట్ ఫోన్ లో చూస్తున్నాము. చిన్న పిల్లాడి నుండి ముసలి వాళ్ళ వరుకు ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి సమాచారం కోసం సెర్చ్ ఇంజిన్ ని ఉపయోగిస్తున్నాం. ఇలా ఇంటర్నెట్ ని వాడే తరుణం లో బయట చేసే మార్కెటింగ్ ని ఇంటర్నెట్ ద్వారా చేస్తే అదే డిజిటల్ మార్కెటింగ్. ఆన్ లైన్ లో ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేసేవాళ్ళకి , తమ కంపెనీల బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకోవాలనుకునే వాళ్లకి ఈ డిజిటల్ మార్కెటింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఇది ట్రేడిషనల్ మార్కెటింగ్ కి పూర్తి విభిన్నం. ఇంతకు ముందు టీవీ , రేడియోలలో యాడ్స్ ఇచ్చేవారు. ఇవి చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. కానీ ఇప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియాల ద్వారా యాడ్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా మనం ఎవరినైతే టార్గెట్ చేయాలనుకుంటున్నామో వాళ్లకి మాత్రమే మన సమాచారం చేరేలా సహాయపడుతుంది. తక్కువ టైములో ఎక్కువ మంది కస్టమర్స్ ని రీచ్ అయ్యేలా చేసేదే డిజిటల్ మార్కెటింగ్. మనలో చాలా మందికి తలెత్తే ప్రశ్న, డిజిటల్ మార్కెటింగ్ ఎవరు చేయొచ్చు, ఎవరికి ఉపయోగం, అసలు నేను అర్హుడునా అని. ఇది ఎవరైనా చేయొచ్చు. విద్యార్థులు ఐతే దీన్నే కెరీర్ గా తీసుకోవచ్చు, మీరు ఆల్రెడీ జాబ్ లో ఉన్నట్లయితే పార్ట్ టైం గా చేసుకోవచ్చు, లేక మీ సొంత బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు.ఇలా చాలా విషయాల్లో మీకు డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగపడుతుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్ లో కొన్ని మోడ్యూల్స్ ఉన్నాయి. అందులో మీ టాలెంట్ కి ఏది రిలేటెడ్ గా ఉంటుందో అది చేస్తే మీరు కూడా నెలకి వేలల్లో సంపాదించుకోవచ్చు. మరి ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న రక రకాల పద్ధతులేంటి ? డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే...ఏమేమి నేర్చుకొని ఉండాలి? డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే..మీకు ఈ క్రింది 10 విషయాల మీద అవగాహన ఉండాలి.
మనం ఏ పని చేయాలన్న కూడా దాని మీద మనకి పూర్తి అవగాహనా కల్పించుకోవడం చాలా అవసరం. అవగాహన లేకుండా ఏది చేయలేము. అయితే మనకి సాధారణ మార్కెటింగ్ గురించి తెలుసు. మరి ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. అందుకే ఈ మోడ్యూల్ లో డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏమి చేయాలి, ఎటువంటి టూల్స్ ఉపయోగించాలి అని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ లో దశాబ్ద కాలం నుండి సరికొత్త విధానాలను అమలుపరచడం జరుగుతుంది.
డిజిటల్ మార్కెటింగ్ చేసేవారికి అతి ప్రధానమైనది వెబ్ సైట్ ని రూపొందించడం. ఒక వెబ్ సైట్ క్రియేషన్ కి కావాల్సిన డొమైన్ పేరు ని ఏవిధంగా పెడతారు , రిజిస్టర్ చేసుకొనే పద్దతి, దానికి హోస్టింగ్ ఇచ్చే ప్రక్రియ, అందులో వర్డుప్రెస్సుని ఇన్స్టాల్ చేయడం తెలుసుకోవాలి. అంతే కాకుండా ఈ - కామర్స్ మరియు ఆన్ లైన్ అమ్మకాలు ఎలా చేయాలో తెలుసుకోవాలి. వెబ్ సైట్ రూపకల్పన మరియు దానిని అభివృద్ధి చేయడం కూడా తెలుసుకొని ఉండాలి.
ఒక వెబ్ సైట్ ని మొదటి పేజీ లోకి తీసుకు రావడమే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్. అయితే ఇది చెప్పినంత సులువు కాదు. చాలా ఓపిక ఉండాలి కానీ ఖర్చు లేనిది. ఉదా: ఏదైనా ఒక సమాచారం కోసం సెర్చ్ ఇంజిన్స్ లో వెతుకుతుంటే (గూగుల్, బింగ్, యాహు) అక్కడ మనకి దానికి సంభందించిన పేజీలు చాలా కనిపిస్తాయి. అలా చాలా పేజీలు కనిపించినా కూడా మనం మొదటి పేజీలో ఉన్న వెబ్సైటు కి మాత్రమే ప్రాముఖ్యతనిస్తాం. ఐతే అలా మొదటిపేజీలోకి ఒక వెబ్ సైట్ ని తీసుకు రావడం ఎలా అనేదే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్. దీనిద్వారా గూగుల్ లో సెర్చ్ చేసే యూజర్స్ ని మన వెబ్ సైట్ కి ఒక ట్రాఫిక్ గా మలుచుకోవచ్చు.
సోషల్ మీడియా అనగానే మన అందరికి వెంటనే గుర్తొచ్చేవి ఫేస్బుక్, పింటరెస్ట్ , లింక్డ్ఇన్ ఇలా చాలా ఉన్నాయ్. ఈ సోషల్ మీడియా మనం ప్రపంచంలో ఎక్కడున్నా ఒక దగ్గర కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఆలాంటి సోషల్ మీడియాని వాడుకుంటూ ఒక బ్రాండ్ ప్రచారం కానీ, ఒక కంపెనీ ప్రొడక్ట్స్ ని కానీ మార్కెటింగ్ చేయడమే సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా లో కూడా చాలా రకాల సైట్స్ ఉన్నప్పటికీ మనకి కావాల్సిన కస్టమర్స్ ఏ సైట్ లో దొరుకుతారో చూసుకొని తక్కువ ఖర్చుతో మనకి కావాల్సిన వ్యక్తులకు మాత్రమే ప్రచారం చేయడం సోషల్ మీడియా మార్కెటింగ్ గా చెప్పుకోవచ్చు.
ఈమెయిల్ మార్కెటింగ్ అనగా మనం తరచూ ఉపయోగించే మెయిల్స్ కి ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ కానీ, బ్రాండ్ ప్రచారానికి గానీ, కొత్త విషయాల గురించి, మన కస్టమర్లకి సమాచారాన్ని మెయిల్ ద్వారా చెప్పడాన్ని ఈ మెయిల్ మార్కెటింగ్ అంటారు. ఇది కొన్నిసెకండ్ల కాలంలో కస్టమర్ కి నేరుగా చేరిపోతుంది. అంతేకాక కస్టమర్ అభిప్రాయాలను , సందేహాలను నేరుగా తెలుసుకోవచ్చు.ఈ-మెయిల్ మార్కెటింగ్ ద్వారా కస్టమర్ కి మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది.
ఇన్ఫ్లుయెన్స్ అంటే మనకి తెలుసు. ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి మరొకరికి సపోర్ట్ గా చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అంటాం. అలాగే ఒక బాగా పేరు ఉన్న ఒక కంపెనీ సపోర్ట్ తీసుకొని మార్కెటింగ్ చేయించుకుంటే అదే ఇన్ఫ్లుయెన్సుర్ మార్కెటింగ్ అంటారు. అయితే ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఒక బ్రాండ్ ని ప్రచారం చేయడానికి ఇన్ఫ్లుయెన్సుర్ మార్కెటింగ్ బాగా ప్రభావితం చేస్తుంది. ఇది సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ తో సంభంధం కలిగి ఉంటుంది.
యూట్యూబ్ కూడా గూగుల్ తర్వాత సెర్చ్ ఇంజిన్ లో 2 వ స్థానాన్ని సంపాదించుకుంది. యూట్యూబ్ సాధారణ వ్యక్తుల్ని కూడా ప్రముఖులుగా చేస్తుంది. అలాగే బ్రాండ్ ప్రచారాలకి కూడా యూట్యూబ్ ని ఎలా ఉపయోగిస్తారు అనేది తెలుసుకోవచ్చు.యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పుడు మధ్య మధ్య లో వచ్చే బ్రాండ్ ప్రచారాలను ఎలా పెట్టవచ్చు అనేది తెలుసుకోగలుగుతాం. అంతేకాకుండా యూట్యూబ్ మార్కెటింగ్ లో వీక్షించేవారి సంఖ్య పెరిగే కొద్దీ డబ్బులు సంపాదించుకోవడం సులువు గా ఉంటుంది.
డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ మార్కెటింగ్ రాజు అని చెప్పుకోవచ్చు. కొనుగోలుదారుడు ఎంపిక చేసుకునే ప్రతి విషయములోనూ కంటెంట్ ని చూస్తాడు. కంటెంట్ ఎంత బాగుంటే ఆ ప్రోడక్ట్ కి అంత విలువ పెరుగుతుంది. కంటెంట్ ను బట్టి కస్టమర్స్ ఆకర్షితులు అవుతారు. ఈ మోడ్యూల్ లో కంటెంట్ ను అభివృద్ధి చేయడం నేర్చుకుంటారు. కంటెంట్ వ్రాయడం అనేది మనం చేసే సాధన బట్టి వస్తుంది. ఒక వెబ్ సైట్ లో కంటెంట్ బట్టి ఆ వెబ్ సైట్ కి ట్రాఫిక్ పెరుగుతుందనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
గూగుల్ ఆడవర్డ్స్ అనగా ఒక వెబ్ సైట్ ని డబ్బులు చెల్లించి ప్రచారం చేసుకోడానికి, మరియు ఆ వెబ్ సైట్ యొక్క ట్రాఫిక్ ని ఎక్కువుగా పెంచడానికి ఇది ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాక వెబ్ సైట్ ని వీక్షించే వారి సంఖ్య ని కూడా పరిశీలించుకోవచ్చు. ఒక కంపెనీ ప్రచారాలను అభివృద్ధి చేయడం, పెట్టుబడికి తగ్గా ప్రతిఫలం పొందడానికి ఈ ఆడ్వార్డ్స్ చాలా అవసరం.
గూగుల్ అనలిటిక్స్ తో మీ వెబ్సైటు లోకి ఎంత మంది విజిటర్స్ వస్తున్నారు, ఎక్కడినించి వస్తున్నారు, ఏమి చేస్తున్నారు, ఎంత సేపు ఉంటున్నారు లాంటి అన్ని విషయాలు తెలుసుకోవడం కుదురుతుంది. మీరు చేయాల్సిందల్లా గూగుల్ అనలిటిక్స్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, వచ్చిన కోడ్ ను తీసుకువెళ్లి మీ వెబ్సైటు లో యాడ్ చేయడమే. ఇలా ఈ పైన తెలుసుకున్న ప్రతి విషయం మీద మనం డిజిటల్ మార్కెటింగ్ లో నేర్చుకోవడం జరుగుతుంది. రానున్న కాలం లో దీని మీద మరింత ఉద్యోగ అవకాశాలు ఉండబోతున్నాయి. డిగ్రీ చేసినవారెవరైనా కూడా ఈ కోర్స్ లో రాణించవచ్చు. ఇప్పటికే చాలా మంది ఈ కోర్స్ చేసిన వారు సొంతంగా చిన్న చిన్న స్టార్ట్ అప్స్ పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయితే ఏదో కోర్స్ జాయిన్ అయిపోయాం , జాబ్ చేసేద్దాం అనుకుంటే కాదు. చేసే పని లో ఏకాగ్రత చూపించగలిగితేనే పోటీ ప్రపంచం లో నిలదొక్కుకోగలం. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు అందరికి ఉపయోగకరం ఈ డిజిటల్ మార్కెటింగ్.